ప్రాణాలపైకి తెచ్చిన నిర్లక్ష్యం : పారాసిటమాల్ బదులు ట్రమడోల్ ట్యాబ్లెట్స్

నాంపల్లిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో చోటు చేసుకున్న ఘటన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఒక చిన్న తప్పిదం ఓ తల్లికి గర్భశోకం మిగిల్చింది. 

  • Publish Date - March 7, 2019 / 10:18 AM IST

నాంపల్లిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో చోటు చేసుకున్న ఘటన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఒక చిన్న తప్పిదం ఓ తల్లికి గర్భశోకం మిగిల్చింది. 

నాంపల్లిలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో చోటు చేసుకున్న ఘటన అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఒక చిన్న తప్పిదం ఓ తల్లికి గర్భశోకం మిగిల్చింది. ఇక్కడ వాక్సిన్‌ తీసుకున్న చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురి కావడం..చిన్నారి మృ‌తి చెందడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. మొత్తం 22 మంది చిన్నారులు నీలోఫర్‌లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. 
Also Read : ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం

ఈ ఘటనపై నీలోఫర్ సూపరింటెండెంట్ డా. మురళి స్పందించారు. నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్‌లో మార్చి 06వ తేదీ బుధవారం 90 మంది చిన్నారులకు టీకాలు ఇచ్చారన్నారు. తరువాత ఇచ్చే మందుల్లో పొరపాటు జరిగిందని, పారాసిటమాల్‌కు బదులు ట్రమడోల్ టాబ్లెట్ ఇచ్చారని, జ్వరం తగ్గడం కోసం ఇచ్చే టాబ్లెట్ డోస్ ఎక్కువ ఉండడంతో చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఫలితంగా 22 మంది చిన్నారులు నీలోఫర్ ఆసుపత్రిలో చేరితే ఒక బాలుడు మృతి చెందాడన్నారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురికి వెంటిలెటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు నీలోఫర్ సూపరింటెండెంట్ డా. మురళి వెల్లడించారు. 
Also Read : ఫస్ట్ టైం : రూ.20 కాయిన్ వచ్చేస్తోంది