ఐటీ రంగంలో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చి, నేడు ప్రపంచానికే తలమానికంగా ఉన్న మదాపూర్ లోని సైబర్ టవర్స్ నిర్మించి 21 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా పలువురు ఐటీ ఇంజనీర్సు సోమవారం, సెప్టెంబర్ 23న వేడుకలు నిర్వహించారు. సైబర్ టవర్స్ వద్ద కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాత ప్రపంచం స్ధాయి ఐటీ సంస్ధలు హైదరాబాద్ను తమ స్ధావరంగా చేసుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న సైబర్ టవర్స్ నేడు ఎందరికో ఉపాధి చూపిస్తోందని కార్యక్రమంలో పాల్గోన్న ఇంజనీర్లు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రభుత్వం ఐటీ రంగం అభివృధ్దికి అనేక చర్యలు తీసుకుంటోందని, హైదరాబాద్ లో ఐటీ రంగం మరింత అభివృధ్ధి చెందాలని కార్యక్రమంలో పాల్గోన్న పులువురు ఐటీ నిపుణులు కోరారు.