38 డిగ్రీలు  : హైదరాబాద్ లో ఎండలు బాబోయ్ 

  • Publish Date - March 12, 2019 / 07:38 AM IST

హైదరాబాద్ : వేసవి ప్రారంభంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భగ భగలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. దక్షిణ మధ్య కర్ణాటక నుంచి విదర్భ వరకు, ఉత్తర మధ్య కర్ణాటక, మరట్వాడా మీదుగా దాదాపు కిలోమీటర్ ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈప్రభావంతో హైదరాబాద్ సహా..తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. గత రెండు రోజులుగా సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉన్న ఉష్ణోగ్రత..మంగళవారం (మార్చి 12) 38 డిగ్రీలకు చేరింది. 
 

పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గాలిలో తేమ శాతం తగ్గిపోతుండటంతో  నగర వాసులు పగలు వేడి..రాత్రి పూట ఉక్కపోతతో సతమతమైపోతున్నారు. సోమవారం (మార్చి 11) గరిష్ఠంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ప్రజలు అత్యవసరమైతేనే ఇల్లు దాటి బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. మరో మూడు నాలుగు రోజుల పాటు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు.

ట్రెండింగ్ వార్తలు