తెలంగాణలో నలుగురు సిట్టింగ్ ఎంపీలకు ఫిట్టింగ్ తప్పదా ? టీఆర్‌ఎస్ ఎంపీలతో పాటు పార్టీలోకి వలస వచ్చిన నేతకు కేసీఆర్ ఎందుకు టికెట్ నిరాకరిస్తున్నారు ? ఆ నలుగురు ఎంపీలు…అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు సహకరించారా ? లేదంటే పార్టీ గెలుపునకు సరిగా పని చేయలేదా ? గులాబీ దళపతి ఎందుకు గుర్రుగా ఉన్నారు ?
Read Also : ఓటరు జాబితాలో మీ పేరు లేదా.. దరఖాస్తుకు 3 రోజులే
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో…అధికార టీఆర్ఎస్ ఎంపీల్లో టెన్షన్ మొదలైంది. నలుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ ఇచ్చేది లేదంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు సహకరించని వారిని ఉద్దేశించే కేసీఆర్…ఈ వ్యాఖ్యలు చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఆ నలుగురు పార్లమెంట్ సభ్యులు ఎవరన్న దానిపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది.
అయితే మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మహాబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, వైసీపీ నుంచి గెలిచి…టీఆర్ఎస్‌లో చేరిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలేనని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిలో పసునూరి దయాకర్…కడియం రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు.
Read Also : ఎన్నికల యుద్ధానికి మహిళా పార్టీ రెడీ: 9 స్థానాల్లో పోటీ
మహబూబ్‌నగర్, వరంగల్, మహాబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ స్థానాల్లో…కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ ఎంపీ వివేక్‌కు టికెట్ ఇవ్వకూడదని మొదట అనుకున్నప్పటికీ…మారిన పరిస్థితుల నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Read Also : దేవడా : ఓటర్ల లిస్టులో బాహుబలి, ఇడ్లీ, సెక్స్, నిట్