సూర్యతేజను అరెస్టు చేస్తారా : ఓపెన్ కాని ఝాన్సీ ఫోన్ 

  • Publish Date - February 9, 2019 / 11:15 AM IST

హైదరాబాద్ : బుల్లితెర నటి ఝాన్సీ సూసైడ్ ఎందుకు చేసుకుంది ? ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటీ ? అనే దానిపై ఓ క్లారిటీ రావడం లేదు. ఝాన్సీ ఆత్మహత్యకు లవర్ సూర్యతేజనే కారణమంటూ ఆమె ఫ్యామిలీ ఆరోపిస్తోంది. సూర్య తేజను అరెస్టు చేయాలంటూ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఝాన్సీకి సంబంధించిన ఓ ఫోన్ డేటాను పరిశీలిస్తే కీలక అంశాలు బయటపడే ఛాన్స్‌లున్నాయి. 

మా టీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం అనే సీరియల్‌లో నటించిన వర్ధమాన నటి ఝాన్సీ ఆత్మహత్య కలకలం రేపింది. రోజులు గడుస్తున్నాయి..కానీ కేసు ఓ కొలిక్కి రావడం లేదు. పంజాగుట్ట పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్య తేజను పోలీసులు విచారించాల్సి ఉంది. ఇతడిని పోలీసులు ఇంతవరకు ఎందుకు విచారించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రియుడు సూర్యనే కారణమని..అతడిని అరెస్టు చేయాలంటూ ఝాన్సీ ఫ్యామిలీ డిమాండ్ చేస్తోంది. 

ఇదిలా ఉంటే ఈమెకు సంబంధించిన రెండు ఫోన్లు లభ్యమయ్యాయి. ఇందులో ఒకటి ఓపెన్ కాగా..మరొక ఫోన్ లాక్ ఓపెన్ కావడం లేదు. ఇది ఓపెన్ అయితే కీలక విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ఈ కేసుపై పంజాగుట్ట ఏసీపీతో 10tv ముచ్చటించింది. ఝాన్సీ అంత్యక్రియల కోసం వారి స్వగ్రామానికి వెళ్లారని..అనంతరం ఫిబ్రవరి 09వ తేదీన ఆమె ఫ్యామిలీ మెంబర్స్‌ పీఎస్‌కు వచ్చారని తెలిపారు. సూర్య తేజపై ఫిర్యాదు చేసినట్లు..ఆ వ్యక్తి పీఎస్‌కు వచ్చిన అనంతరం విచారిస్తామన్నారు. ఫిర్యాదు చేసిన వారు కొంత అందుబాటులో లేకపోవడంతో విచారణ ఆలస్యమౌతోందన్నారు. లాక్ అయిన ఫోన్ ఓపెన్ అయితే…ఇతర విషయాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయన్నారు. 

ఫిబ్రవరి 5వ తేదీ ఝాన్సీ సూసైడ్ చేసుకుంది. 
శ్రీనగర్‌ కాలనీలో సాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో ఫ్యాన్‌కి చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది. 
ప్రేమించిన వాడు మోసం చేయడం వల్లే తన కూతురు చనిపోయిందని ఝాన్సీ తల్లి అన్నపూర్ణ ఆరోపించింది. 
ఝాన్సీ చనిపోవడానికి ముందు తన అత్మహత్యకు గల కారణాలను వెల్లడిస్తూ సెల్ఫీ వీడియో తీసినట్లు సమాచారం.