ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల కేటాయింపు

  • Publish Date - February 19, 2019 / 05:23 AM IST

హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర కేబినెట్‌ విస్తరణ మంగళవారం ఉదయం 11:30 గంటలకు రాజ్ భవన్ లో జరుగుతుంది. గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మంత్రివర్గ విస్తరణలో పదిమందికి చోటు కల్పించారు. వీరిలో గతంలో మంత్రులుగా పని చేసిన ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి  ఉన్నారు.
 

కొత్తగా సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వీ. శ్రీనివాస్‌ గౌడ్‌, సీహెచ్‌ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి కి కేసీఆర్  అవకాశం కల్పించారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తరువాత కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నుంచి వచ్చే ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించిందీ వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది.