రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ 

  • Publish Date - January 12, 2020 / 03:40 PM IST

ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో  తాజా రాజకీయ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని పరిష్కారం కాని అంశాలు, జలవనరుల సద్వినియోగం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.