‘తాను జాతియ గీతాన్ని వ్యతిరేకించలేదు…అయితే దీనిని పౌరులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తా..ఎప్పటికీ ‘జై హింద్’ అనే అంటా’ అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. నెటిజన్‌లో చురుకుగా ఉండే ఈయన నెటిజన్‌లతో మాట్లాడారు. ‘ఆస్క్ అసద్’ పేరిట మార్చి 07వ తేదీ గురువారం నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు.
Also Read : మళ్లీ బాలయ్యకు టికెట్
అందరి కోసం తమ పార్టీ పోరాడుతుందని చెప్పిన ఆయన బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలన్నదే తమ కోరిక అని వెల్లడించారు. కాశ్మీర్‌లో నెలకొన్న సమస్యలపై కూడా మాట్లాడారు. మతం పేరిట భయం సృష్టించడం ఎప్పటికైనా ముప్పేనంటూ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలక భూమిక పోషిస్తాయని చెప్పారు.
ఒక నెటిజన్ ఆసక్తికర కొశ్చన్ అడిగారు. ప్రధాని అయితే చేసే మొదటి పని ఏంటీ అని అడిగితే…తనకు అలాంటి ఉద్దేశం లేదు..ఉన్న దానితో ఖుష్‌గా ఉన్నానంటూ సమాధానం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలు పాటు, యూపీ, మహారాష్ట్రలోనూ తమ పార్టీ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు ఓ నెటిజన్ ప్రశ్నకు తెలిపారు.
Also Read : నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2