హైదరాబాద్ గణేష్ వేడుకల్లో రికార్డు స్థాయిలో వేలం జరిగే బాలాపూర్ లడ్డూకు ప్రత్యేక స్ధానం ఉంది. భక్తుల కొంగు బంగారంగా బాలాపూర్ గణేష్ లడ్డూ ప్రసిద్ధి పొందింది. బాలాపూర్ లడ్డు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే రికార్డు స్థాయిలో ఈ లడ్డును వేలం పాటలో దక్కించుకుంటుంటారు. ఈ సంవత్సరం కూడా కొలను రామ్ రెడ్డి రూ. 17 లక్షల 60 వేలకు పాడి ఈ లడ్డూను దక్కించుకోగా గత రికార్డులను తిరగరాసింది. అయితే ఈ రికార్డును పడగొట్టేసింది ఫిలింనగర్‌లోని వినాయక నగర్‌లోని గణేశ్ లడ్డూ.
బీజేపీ నేత పల్లపు గోవర్థన్ 17 లక్షల 75 వేల రూపాయలకు వినాయక నగర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. వేలం పాటలో ఈ ఏడాది పలువురు భక్తులు పోటీ పడగా గతేడాది లడ్డూను 15 లక్షల 1116 రూపాయలకు సొంతం చేసుకున్న పల్లపు గోవర్థనే ఈ సంవత్సరం కూడా లడ్డూను సొంతం చేసుకున్నారు. 2016, 2017, 2018 నుంచి లడ్డూ బాగా ప్రాచుర్యం పొందగా ప్రతి ఏడాది రేటు పెరిగిపోతూ వస్తోంది.