Ganesh Chaturthi-2022: హైదరాబాద్‌లో గణేశుడి విగ్రహాల తయారీదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన వైనం

విగ్రహాల తయారీదారులు స్పందిస్తూ... పీవోపీపై నిషేధం ఉండడంతో తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు. దినసరి కూలీలకు కూడా పీవోపీ ద్వారానే ఉపాధి లభించేదని చెప్పారు. మహారాష్ట్రలోని సోలాపూర్ లోని 99 మంది కుటుంబాలు ఆ వ్యాపారం మీదే ఆధారపడతాయని తెలిపారు. పీవోపీపై నిషేధం విధించడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. పీవోపీపై నిషేధం వల్ల గణేశుడి విగ్రహాల తయారీకి సరైన సామగ్రి లభించడం లేదని తెలిపారు.

Ganesh Chaturthi-2022

Ganesh Chaturthi-2022: ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీవోపీ) వినాయక విగ్రహాల తయారీపై నిషేధం ఉండడంతో తమ వ్యాపారం బాగా దెబ్బతిందని హైదరాబాద్ లోని వినాయక విగ్రహాల తయారీదారులు మీడియాకు చెప్పారు. హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. వినాయక చవితికి వారం రోజుల ముందు నుంచి గణేశుడి విగ్రహాల కొనుగోళ్ళు ప్రారంభం అవుతాయి. ఈ సారి గణేశుడి విగ్రహాలను తక్కువగా తయారు చేశారు. వాటి రేట్లు కూడా దాదాపు 40 శాతం వరకు పెరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో విగ్రహాల తయారీదారులు స్పందిస్తూ… పీవోపీపై నిషేధం ఉండడంతో తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు. దినసరి కూలీలకు కూడా పీవోపీ ద్వారానే ఉపాధి లభించేదని చెప్పారు. మహారాష్ట్రలోని సోలాపూర్ లోని 99 మంది కుటుంబాలు ఆ వ్యాపారం మీదే ఆధారపడతాయని తెలిపారు. పీవోపీపై నిషేధం విధించడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు.

పీవోపీపై నిషేధం వల్ల గణేశుడి విగ్రహాల తయారీకి సరైన సామగ్రి లభించడం లేదని తెలిపారు. వేరే పద్ధతుల్లో విగ్రహాలు తయారు చేస్తే చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో విగ్రహాలు కొనడంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు. తాము ముంబై, సోలాపూర్, పుణె నుంచి గణేశ విగ్రహ తయారీ సామగ్రిని తీసుకొచ్చుకుంటామని అన్నారు. మరోవైపు, గణేశ విగ్రహాలు కొనడానికి వచ్చి వారు కూడా ధరల పెరిగిపోయాయని వాపోతున్నారు.

Karnataka school Book: ‘జైలులో సావర్కర్ వద్దకు పక్షులు వచ్చేవి.. వాటి రెక్కలపై ఆయన ఎగిరి వెళ్ళేవారు’ అంటూ బడిలో పాఠాలు