'Alai Balai' Celebrations
‘Alai Balai’ Celebrations: హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఏడాది బండారు దత్తాత్రేయ దసరా మరుసటి రోజు అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఈ సారి ఆయన కుమార్తె ఆధ్వర్యంలో జరుగుతోన్న కార్యక్రమానికి పలువురు ప్రముఖులు వచ్చారు. ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వచ్చారు.
అలాగే, బండారు దత్తాత్రేయ ఆహ్వానం మేరకు అలయ్ బలయ్ కార్యక్రమానికి సినీనటుడు చిరంజీవి వచ్చారు. దత్తాత్రేయతో పాటు పలువురుకి అలయ్ బలయ్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా హాజరయ్యారు. అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ డబ్బు వాయించారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరవుతున్నారు.
అలయ్ బలయ్ కు అన్ని పార్టీల ముఖ్య నాయకులతో పాటు, ప్రముఖులను, ఉన్నత అధికారులను ఆహ్వానించినట్లు విజయ లక్ష్మి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేగాక, అతిథులకు తెలంగాణ రుచులు చూపించే విధంగా పలు వంటకాలు చేశారు.
https://www.youtube.com/watch?v=yGUdjwTP0lM
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..