Etela Rajender Suspended: అసెంబ్లీ సమావేశాల నుంచి ఈటలపై సస్పెన్షన్ వేటు.. వాహనంలో వెళ్తున్న ఈటలను అడ్డుకున్న పోలీసులు
అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశాలు ముగిసే వరకు ఈటలపై సస్పెన్షన్ కొనసాగుతుందని అన్నారు. దీంతో ఈటల రాజేందర్ సభ నుంచి వెలుపలకు వచ్చారు. అయితే, తన వాహనంలో బయటకు వెళ్తున్న ఈటలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ వాహనం దించి పోలీసుల వాహనంలో ఈటలను పంపించారు. ఆ సమయంలో, తనను అరెస్టు చేస్తున్నారా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.
- T Venkateshwarlu
- Published On : September 13, 2022 / 10:47 AM IST
Etela Rajender Suspended
Etela Rajender Suspended: అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ సమావేశాలు ముగిసే వరకు ఈటలపై సస్పెన్షన్ కొనసాగుతుందని అన్నారు. దీంతో ఈటల రాజేందర్ సభ నుంచి వెలుపలకు వచ్చారు. అయితే, తన వాహనంలో బయటకు వెళ్తున్న ఈటలను పోలీసులు అడ్డుకున్నారు. ఆ వాహనం దించి పోలీసుల వాహనంలో ఈటలను పంపించారు.
ఆ సమయంలో, తనను అరెస్టు చేస్తున్నారా? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. మరోవైపు, ఈటల రాజేందర్ సభాపతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈటల రాజేందర్ క్షమాపణలు చెప్పి సభలోకి రావాలని అన్నారు. తాము సభలో చర్చించాలనే అనుకుంటున్నామని, బీజేపీ నేతలు మాత్రం చర్చించకుండా బయట అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.
కాగా, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర మనిషి అంటూ ఈటల రాజేందర్ ఇటీవల అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర అవమానించారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈటలను సభ నుంచి సస్పెండ్ చేశారు.
COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా రోజువారీ కేసులు… కొత్తగా 4,369 నమోదు
