ఖబడ్దార్ పవన్ కళ్యాణ్ : రాజా సింగ్ స్ట్రాంగ్ కౌంటర్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల హిందూ ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ మతం, ధర్మం గురించి కనీసల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్‌ ఏ మతానికి చెందిన వారని, ఇతర మతానికి మారిపోయారా? అని ప్రశ్నించారు. మీరు పెట్టిన చిల్లర పార్టీలో హిందువులు లేరా అని ఘాటుగా విమర్శించారు. 

  • Publish Date - December 3, 2019 / 05:00 AM IST

హిందూ మతాన్ని టార్గెట్‌గా చేసిన మట్లాడం సరైనది కాదని, లౌకికతత్వంపై పవన్‌కు కనీస అవగాహన లేదని హితవు పలికారు. పవన్‌ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. లేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని, ఖబడ్దార్ పవన్‌ అని  హెచ్చరిస్తూ ట్విట్టర్లో వీడియో పోస్టు చేశారు.

కాగా ….జనసేనపార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ సోమవారం డిసెంబర్2న  తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో హిందూ మతం పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మతరాజకీయాలు ఆడేది హిందూ  రాజకీయ నేతలే అని ఆయన ఆసభలో కామెంట్ చేశారు. మతాల మధ్య గొడవపెట్టేది హిందూ నాయకులేనని పవన్‌ ఆరోపించారు. ఇతర మతాలలో ఉన్న నాయకులు ఇలాంటి పనులు చేయరని చెప్పారు. అలాగే టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది  కూడా హిందువులేనని  పవన్ ఆరోపించారు.

హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవని ఆనయ అన్నారు. తాను చిన్నప్పటి నుంచి వింటోంది ఒకటేనని..సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతోంది హిందూవులు మాత్రమేనని వ్యాఖ్యానించారు. మిగతా మతాల వారు ఇలాంటి పనులు చేయరని చెప్పారు. కాగా, పవన్‌ హిందూ మతంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి. పలువర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.