కేంద్రం తీసుకొచ్చిన GSTపై కొట్లాడింది తెలంగాణ రాష్ట్రం..ఒక్క విషయంలో గొంతెత్తారా ? కేవలం నామమాత్రంగా కాంగ్రెస్ మాట్లాడింది..కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినతిపత్రాలు ఇచ్చామని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు నోరు తెరవాలని ప్రధాన మంత్రి ఎదుట కాపీలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం చేసిన విధానాలను ఎండగట్టారు. సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు.
తాము జీఎస్టీపై కొట్లాడిన అనంతరం తర్వాత రాయితీలు వచ్చాయని స్పష్టం చేశారు. మొన్న..గోవాలో జరిగిన సమావేశానికి ఆర్థిక మంత్రి హరీష్ రావు వెళ్లి ఓ వినతిపత్రం ఇచ్చారని, కేంద్రంతో కొట్లాడుతున్నట్లు తెలిపారు. రిజర్వేషన్లు విషయంలో ఏ, బీ, సీ, డీ చేసుకుంటామంటే ఎందుకివ్వరు ? వర్గీకరణ చేసుకుంటామంటే..కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఇవ్వలేదన్నారు. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా..పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీలో వాన పడితే..ఇక్కడ గొడుగు పట్టుకుంటారని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పరుగెత్తే రాష్ట్రాలకు స్వేచ్చ ఇచ్చి..ఇంకా ఎక్కువ పరుగెత్తించే విధంగా..ముందుకు పోవాలని..అలా చేయకుండా రాష్ట్రాల అధికారాలను హరించి, అన్నీ కేంద్రాల దగ్గర పెట్టుకుని దారుణంగా చేశారని గుర్తు చేశారు. రాష్ట్రాల అవసరాలు..బతుకులు..పద్ధతులు వేర్వేరుగా ఉంటాయని చెప్పారు. 73 ఏళ్లు గడుస్తున్నా..సమీక్షించే వారు లేరని..మాట్లాడే వారిని బెదిరింపులకు గురి చేయడం..ఇద్దరు కుమ్మక్కు కావడం..ఇదొక కొత్త విద్యగా అభివర్ణించారు. కేంద్ర దగ్గర నిధులు పెట్టుకోవద్దు..తమకు ఇవ్వాలని నిలదీసింది తెలంగాణ..కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మొత్తంగా..కాంగ్రెస్, బీజేపీ దొందుదొందే అని సీఎం కేసీఆర్ సభలో తెలిపారు.
Read More : మాకు నీతులు చెపొద్దు : నలుగురు ఎంపీలను బీజేపీ విలీనం చేసుకుంది