ఈవీఎంలు ట్యాంపరింగ్: నో ఛాన్స్ – రజత్ కుమార్

  • Publish Date - January 25, 2019 / 11:37 AM IST

హైదరాబాద్ : ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం రచ్చ రచ్చ చేస్తోంది. ట్యాంపరింగ్ చేయవచ్చని వివిధ పార్టీలు చెబుతున్నాయి. దీనిని మాత్రం ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఖండిస్తున్నారు. ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదని ఛీప్ ఎలక్టరరోల్ ఆఫీసర్ రజత్ కుమార్ తేల్చిచెప్పారు. గడిచిన శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీకి లొంగిపోయానని చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు.

కోర్టుకు వెళితే…స్వాగతిస్తామని…సీబిఐ విచారాణ చేయిస్తామని అంటే..అది నాకే మంచిదని చెప్పారు. ఆయనతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియచేశారు. పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. తనతో పాటు కేంద్ర మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ రావత్ ఓట్లు హైద్రాబాద్ నాంపల్లిలో వచ్చినట్లుగా తెలిసిందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. తమ బూత్ స్ధాయి అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తోందన్నారు.

ట్రెండింగ్ వార్తలు