నారాయణాద్రి రైలులో ప్రయాణిస్తున్నారా. అయితే..మీకో గమనిక..ఈ రైళ్ల టైమింగ్స్ ఛేంజ్ అయ్యాయి. అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. లింగంపల్లి – తిరుపతి రైళల్లో మార్పులు జరిగినట్లు వెల్లడించింది. లింగంపల్లి స్టేషన్ నుంచి సాయంత్రం 5.15 కి బదులుగా 5.30 గంటలకు బయలుదేరనుందని తెలిపారు. బేగంపేటకు సాయంత్రం 5.50కి..సికింద్రాబాద్ 6.15 గంటలు,
బీబీ నగర్ 6.49, రామన్నపేట రాత్రి 7.30, చిట్యాలకు 7.40, నల్గొండ 8 గంటలకు, మిర్యాలగూడ 8.24, నడికుడికి 8.57, పిడుగురాళ్ల 9.18, సత్తెనపల్లి 9.47, గుంటూరుకు రాత్రి 11 గంటలకు చేరుకుంటుందన్నారు.
తెనాలి, రేణిగుంట స్టేషన్ల మధ్య ఎలాంటి ప్రయాణ సమయాల్లో ఛేంజ్ లేదన్నారు. తిరుపతికి ఉదయం 6.05కి బదులు 6 గంటలకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. గుంటూరులో 15 నిమిషాలకు బదులు 10 నిమిషాలు మాత్రమే ఆగనుందని, ప్రయాణీకులు గమనించాలని సూచించారు.
Read More : 8 అంశాలపై మంత్రుల కమిటీలు..టి.క్యాబినెట్ నిర్ణయం