రాష్ట్రపతి ఉత్వర్వులు సవరించిన అనంతరం కొత్త జోనల్ వ్యవస్థ అమలు కోసం మార్గదర్శకాలు జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఉత్తర్వులకు మళ్లీ సవరణ కోరాలని నిర్ణయించింది. కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెల్పడంతో జిల్లాల పునర్ వ్యవస్థీకరణతో పాటు రెండు కొత్త జిల్లాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే..ప్రతిపాదిత జోనల్ విధానంలో చేర్చాలని సర్కార్ తాజాగా ప్రతిపాతించింది. ఈ మేరకు జోనల్ వ్యవస్థను సరి చేయాలని కోరుతూ ఫైల్‌ను రాష్ట్రపతి ఆమోదం కోసం ఢిల్లీకి పంపింది.
అప్పటి వరకు జోన్ 1లో నాలుగు, జోన్ 7లో ఐదు జిల్లాలున్నాయి. జోన్ – 1లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను పనర్ వ్యవస్థీకరించి ములుగు జిల్లాగానూ, జోన్ – 7లో మహబూబ్ నగర్ జిల్లాను పునర్ వ్యవస్థీకరించి నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేశారు. రెండు మల్టీ జోన్లు ఉండగా చెరో జోన్‌లోకి ఒక్కో జిల్లా చేరనుంది. 2018 డిసెంబర్‌లోనే కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అయినా కూడా పాత జోనల్ విధానంలోనే నియామకాలు జరుగుతున్నాయి. బదిలీలకు కూడా పాత జోనల్ విధానమే ఎంచుకుంటున్నారు. రాష్ట్రపతి ఉత్వర్వులు సవరించిన అనంతరం కొత్త జోనల్ వ్యవస్థ అమలు కోసం మార్గదర్శకాలు జారీ చేయనుంది టి.సర్కార్.