ఇటీవలికాలంలో టీవీ షోలకు హీరోయిన్లు జడ్జ్‌లుగా హోస్ట్‌లుగా అవుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీయాని తన షోకి హోస్ట్‌గా చేయాలని భావించిన చంద్రాయుడు అనే వ్యక్తికి గట్టి షాక్ ఇచ్చాడు ఓ మోసగాడు. దక్షిణాది తార శ్రీయ పేరు చెప్పి ఓ విలేఖరి ఈ మోసానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే, ఓ ప్రముఖు ఛానల్‌లో రియాలిటీ షో నిర్వహించేందుకు చంద్రాయుడు అనే వ్యక్తి ప్లాన్ చేసుకున్నాడు. ఏ షోకు ఎవరైనా ప్రముఖ హీరోయిన్‌ని హోస్ట్‌గా పెడితే బావుంటుందని అనుకున్నాడు. శ్రీయని హోస్ట్ గా తీసుకోవాలని భావించారు చంద్రాయుడు.
ఈ క్రమంలోనే శ్రీయ కోసం ప్రయత్నాలు చేస్తుండగా చంద్రాయుడుకి ఓ విలేఖరి పరిచయం అయ్యాడు. తనకు హీరోయిన్ శ్రీయ మేనేజర్ సింధూజ తెలుసు అని నమ్మించి, ఆమె ద్వారా శ్రీయని షోకు రప్పిస్తానని చెప్పి, ఆమె కాల్షీట్‌కు రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు.
అందుకు చంద్రాయుడు ఒప్పుకోవడంతో శ్రీయ మేనేజర్‌గా సింధూజ హోటల్‌కి వచ్చింది. శ్రీయని షో కి ఒప్పిస్తానని తెలిపింది సింధూజ. దీనితో సింధూజకు చంద్రాయుడు రూ. 5 లక్షల డబ్బు అడ్వాన్స్‌గా ఇచ్చాడు.
కానీ నెలరోజులైనా శ్రీయ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సింధూజ కానీ, విలేఖరి కానీ అందుబాటులోకి రావట్లేదు. దీనితో చంద్రాయుడు లబోదిబో మంటూ బంజారా హిల్స్ పోలీసులని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.