హైదరాబాద్ జూపార్కులో కలకలం రేగింది. చంపాజి దాడి చేయడంతో యాదయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది 108కి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అంబులెన్స్‌లో యాదయ్యను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం చోటు చేసుకుంది.
జూ పార్కులో యాదయ్య అనే వ్యక్తి పని చేస్తున్నాడు. సోమవారం చింపాజి ఉంటున్న బోనులోకి వెళ్లాడు. అకస్మాత్తుగా చింపాజి అతడిపై దాడి చేసింది. దాడితో తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు యాదయ్య. ప్రాణాలు రక్షించుకోవడానికి బోనులోనే పరుగులు తీశాడు. కానీ అతడిని చింపాజి వదిలిపెట్టలేదు. కాళ్లు..చేతులను కొరికేసింది. యాదయ్య బిగ్గరగా కేకలు వేశాడు.
అరుపులు విన్న తోటి సిబ్బంది అలర్ట్ అయ్యారు. దాడి చేస్తున్న చింపాజిని నిలువరించే ప్రయత్నం చేశారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి..నిలువరించారు. దాడితో యాదయ్యకు షాక్‌కు గురయ్యాడు. అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. ప్రాథమిక చికిత్స అనంతరం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలిస్తారని సమాచారం.