జయరాం హత్య కేసులో సినీ నటుడు అరెస్ట్

  • Publish Date - March 14, 2019 / 05:37 AM IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, మీడియా సంస్థలను నడిపిన చిగురుపాటి జయరాం హత్య కేసులో ముగ్గురు వ్యక్తులను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన జయరాం హత్యకేసులో సినీనటుడు సూర్యప్రసాద్‌ను, అతని స్నేహితుడు కిశోర్‌ను‌, సిరిసిల్లకు చెందిన అంజిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జయరాం హత్య విషయం ముందే తెలిసినా కూడి అంజిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, హత్యకు పరోక్షంగా సూర్య, కిషోర్‌ సహకరించారనే విషయమై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ముగ్గురిని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.