తిరునక్షత్ర మహోత్సవం : ఫిబ్రవరిలో యాదాద్రి ప్రధాన ఆలయం పూర్తి – కేసీఆర్

  • Publish Date - October 28, 2019 / 12:58 PM IST

2020 ఫిబ్రవరి నెలలో యాదాద్రి ప్రధాన ఆలయ పనులు పూర్తవుతాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా 1008 కుండాలతో విశేష యాగాన్ని నిర్వహించతలపెట్టినట్లు తెలిపారు. ప్రపంచ వైష్ణవ పీఠాల పండితులను పిలుస్తున్నట్లు, చిన జీయర్ స్వామీజీ అనుగ్రహంతో వికాస తరంగణి ఆధ్వర్యంలో మహా యాగ కార్యక్రమాలు జరుగుతాయన్నారు సీఎం కేసీఆర్. 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం శంషాబాద్‌లోని శ్రీరామనగరంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి తిరు నక్షత్ర మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ కుటుంబసమేతంగా అక్కడకు వెళ్లి..చిన జీయర్ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…

తొలుతలో చిన జీయర్ స్వామితో అంతగా పరిచయం లేదని..సిద్ధిపేటలో స్వామిజీ ఓ కార్యక్రమం చేపట్టారని..తన నివాసంలో 7 రోజులు ఉన్నారని గుర్తు చేశారు. కొన్ని గ్రామాలను సందర్శించడం జరిగిందని, పోతుగల్ వేణుగోపాల స్వామిని కూడా దర్శించడం జరిగిందన్నారు. కారు డ్రైవర్‌గా ఉంటూ..ఆయన్ను తీసుకెళ్లే వాడినన్నారు. ఆయన చేసిన ప్రసంగాలు..వ్యాఖ్యలు తనను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. ఇటీవలే తాను నిర్వహించిన యాగం సందర్భంగా వర్షం పడుతుందని ఆనాడు స్వామిజీ చెప్పారని, అలానే అయ్యిందన్నారు. కానీ ఎలాంటి సమస్యలు రాకుండా..స్వామి వారి శిష్యులు పనిచేశారన్నారు. 

చిన జీయర్ స్వామిజీ అద్బుతమైన సందేశం ఇస్తూ..గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. హిందూమతం, హైందవ సంప్రదాయంలో భక్తి చాలా మందికి తెలియదని, సంప్రదాయాలకు, మతాలకు ఎలాంటి ఢోకా ఉండదని తాను చెప్పడం జరిగిందన్నారు. త్రిదండి శ్రీమన్నారయణ చిన జీయర్ ట్రస్టు ఆధ్వర్యంలో రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించ తలపెట్టిన రామానుజ భారీ విగ్రహ కార్యక్రమంలో తాను పాల్గొంటానని, ఘనంగా వేడుకలు జరుగుతాయన్నారు సీఎం కేసీఆర్.