Telangana National Integration Day
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 31న బిహార్ వెళ్లనున్నారు. అక్కడ సీఎం నితీష్ కుమార్‌తో సమావేశమవుతారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బిహార్ రాజధాని పాట్నా చేరుకుంటారు. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన ఐదుగురు సైనికులు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు.
Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
అలాగే ఇటీవల సికింద్రాబాద్‌లోని టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బిహార్ వలస కూలీల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందిస్తారు. బిహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం నితీష్ కుమార్‌తో లంచ్ మీటింగ్ ఉంటుంది. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఆయనతో కేసీఆర్ చర్చలు జరుపుతారు. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలనుకుంటున్న కేసీఆర్ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.