హైదరాబాద్: ఫిబ్రవరి 9వ తేదీ 2వ శనివారం అయినప్పటికీ ఉద్యోగులందరూ విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభం రోజున జనవరి 1 వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినందున, దానికి బదులుగా ఇవాళ అందరూ ఆఫీసులుక హాజరు కావాలని ఆదేశించింది. కనుక ఈ రోజు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేయనున్నాయి.
రెండో శనివారం అనగానే సెలవు అనే ఫీలింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది. బ్యాంకులు, స్కూల్స్ కూడా హాలిడేనే. ఈ శనివారం ఆఫీసులకు వెళ్లాలి అనే ఫీలింగ్ రావటంతో.. ప్రభుత్వ ఉద్యోగులు భారంగానే ఆఫీసులకు కదిలారు. రెగ్యులర్ హాలిడే మూడ్ ఉన్నట్లే ఆఫీసుల్లో కనిపించటం విశేషం.