కబ్జాలపై గవర్నర్‌కు ట్వీట్ : బాధితుడికి అపాయింట్ మెంట్

  • Publish Date - October 21, 2019 / 02:50 AM IST

జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో కబ్జాలపై ఓ కామన్ మెన్ చేసిన ట్వీట్‌కు గవర్నర్ స్పందించారు. అధికారులకు కంప్లయింట్ చేసినా ఎవరూ స్పందించడం లేదని..కనీసం మీరైనా స్పందించాలని ఆయన ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన గవర్నర్ కార్యాలయం బాధితుడికి అపాయింట్ మెంట్ కల్పించింది. 
అంబేద్కర్ నగర్ బస్తీకి చెందిన పి.శ్రీనివాసులు తనకు కేటాయించిన స్థలంతో పాటు చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో లీడర్లు కబ్జా చేశారని అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ప్రజాప్రతినిధులకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. ప్రజావాణిలో మొర పెట్టుకున్నాడు. విలువైన సర్కార్ స్థలాలను కొందరు లీడర్లు కబ్జా చేస్తున్నారని, తాను కూడా మోసపోయానని, తన స్థలాన్ని కూడా కబ్జా చేశారంటూ మొర పెట్టుకున్నాడు. ఎవరూ వినిపించుకోలేదు. కొత్తగా వచ్చిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తనగోడు వింటారేమోనని..సమస్యకు పరిష్కారం వస్తుందని శ్రీనివాసులు భావించాడు.

ఏకంగా గవర్నర్‌కు ట్వీట్ చేశాడు. తర్వాత గవర్నర్ కార్యాలయానికి ఫోన్ చేశాడు. దీనంతో కార్యాలయ సిబ్బంది స్పందించారు. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు వచ్చి కలవాల్సిందిగా అపాయింట్ మెంట్ ఇచ్చారు. కనీసం ఈసారైనా తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 
Read More : హైటెక్ సిటీలో హైటెక్ వ్యభిచారం

ట్రెండింగ్ వార్తలు