కేబుల్ ప్రసారాలు నిలిపివేత

ట్రాయ్‌ తీరుపై కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

  • Publish Date - December 29, 2018 / 05:42 AM IST

ట్రాయ్‌ తీరుపై కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్ : ట్రాయ్‌ తీరుపై కేబుల్‌ ఆపరేటర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త విధానంపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ, ఆపరేటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబుల్ ఆపరేటర్లు ఇవాళా కేబుల్ ప్ర‌సారాలను నిలిపివేయనున్నారు. ట్రాయ్ నిబంధనలకు నిరసనగా కేబుల్ ప్రసారాలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కేబుల్ టీవీ ఛానెల్స్ ను బంద్ చేయనునున్నారు. అయితే న్యూస్ ఛానెళ్లకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

వినియోగదారుల పరిరక్షణ, హక్కుల పేరిట ట్రాయ్ అందరినీ మభ్య పెడుతోందని కేబుల్‌ ఆపరేటర్ల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. వినోదాన్ని పేద వర్గాలకు దూరం చేస్తున్నారని మండిపడుతున్నారు. ట్రాయ్ అవలంభిస్తున్న విధానాలు మారాలని అంటున్నారు. ఎంఎస్ఓలు, కేబుల్ ఆపరేటర్ల అభిప్రాయం తెలుసుకోకుండా ధరలు నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పే ఛానళ్లపై పెంచిన ధరలను రద్దు చేయాలని డిమాడ్ చేస్తున్నారు. కేబుల్ ఛార్జీలపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తీసుకురావాలని కోరుతున్నారు.