Site icon 10TV Telugu

కేసీఆర్‌కు లక్ష్మణ్ కౌంటర్

CM KCR statements, K Laxman counter,  BJP Laxman counter to KCR, BC Reservations issue, Narendra Modi

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బీజేపీ పై చేసిన ఆరోపణలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బీజేపీ పై చేసిన ఆరోపణలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ మోకాలికి బొడిగుండుకు లింకు పెడుతున్నారని, మోడీ వద్ద వంగి వంగి దండాలు పెడుతూ…. ఇక్కడకి వచ్చి విమర్శలు చేయడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ వాడిన భాష పట్ల లక్ష్మణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయకుండా కెసిఆర్ తప్పు చేశారని….తప్పును కప్పి పుచుకోవడానికి కేసీఆర్ ఎదురుదాడి చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు…ఇప్పటికైనా హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుకు, సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అని లక్ష్మణ్ డిమాండ్ చేసారు.బిసిలకు 34 శాతం ఉన్న రిజర్వేషన్ ను 22 శాతానికి తగిస్తే ఊరుకునేది లేదని ఆయన కేసీఆర్ ను హెచ్చరించారు.

Exit mobile version