కరోనా ఎఫెక్ట్ : గాంధీ ఆసుపత్రి డాక్టర్ పై సస్పెన్షన్ వేటు

చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషుల ప్రాణాలే కాదు.. ఉద్యోగాలు కూడా ఊడకొడుతోంది. కరోనా కారణంగా ఓ డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్

  • Publish Date - February 10, 2020 / 01:29 PM IST

చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషుల ప్రాణాలే కాదు.. ఉద్యోగాలు కూడా ఊడకొడుతోంది. కరోనా కారణంగా ఓ డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్

చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషుల ప్రాణాలే కాదు.. ఉద్యోగాలు కూడా ఊడకొడుతోంది. కరోనా కారణంగా ఓ డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి డాక్టర్ కరోనాకి బలయ్యారు. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరికి కరోనా వచ్చిందని ప్రచారం చేసిన డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆ డాక్టర్.. గాంధీ ఆసుపత్రి సీఎంవోగా విధులు చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది.

కరోనా వైరస్ పై అసత్యాలు ప్రచారం చేశారని చెబుతూ డాక్టర్ పై చర్యలు తీసుకుంది. కరోనా వైరస్ గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వైద్య ఆరోగ్య శాఖ వార్నింగ్ ఇచ్చింది. పుకార్లను ప్రచారం చేసినందుకే డాక్టర్ పై వేటు పడిందని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. ఇది ఒక్కటే కారణం కాదని.. గత ఏడాదిగా.. పాలన పరంగా సదరు డాక్టర్ ఇబ్బందులు పెట్టారని చెప్పారు. కాగా, వ్యక్తిగత కక్షతో డాక్టర్ పై చర్యలు తీసుకున్నామన్నది అవాస్తవం అన్నారు.

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు చైనీయులకు.. కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చిందని వారం రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ.. ఇందులో వాస్తవం లేదని చెప్పింది. దీన్ని సీరియస్ గా తీసుకుంది. పుకార్లను ప్రచారం చేశారని గాంధీ ఆసుపత్రి వర్గాలు ఫిర్యాదు చేయడంతో.. సదురు డాక్టర్ పై అధికారులు వేటు వేశారు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లో సరెండర్ చేయాలని ఆదేశించింది.

కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు పోగా.. దాదాపు 30వేల మందికిపైగా వైరస్ సోకింది. దీన్ని నిర్మూలించడానికి చైనా విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. వైరస్ తీవ్రతతో ఇళ్లు, అపార్ట్‌మెంట్లను దాటి ప్రజలను బయటకు రానివ్వడం లేదు అక్కడి అధికారులు. ఎంత అత్యవసర పరిస్థితి అయినా ప్రజలను గడప దాటి బయటకు పంపించడం లేదు. బలవంతంగా ఇంటి డోర్లు మూసి.. అవి తెరుచుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇంతకాలం ప్రజలతో కళకళలాడిన వూహాన్ నగరం.. కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు శ్మశానంగా మారిపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి.. కరోనా మృతులతో మొత్తం డెడ్ సిటీగా మారిపోయింది. వూహాన్ వాసులంతా ఇప్పుడు ఆస్పత్రుల్లో లేదా ఇంట్లో మాత్రమే ఉంటున్నారు. నగరంలోని అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనిమిస్తున్నాయి. నిత్యవసరాలకు సమస్య లేకుండా చైనా సర్కారు చూస్తోంది. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులను తెరిచి ఉంచింది. ప్రజలు కోరిన వస్తువులను ఇంటికే సరఫరా చేస్తోంది. ఈ వైరస్ తీవ్రత తగ్గేవరకు ప్రజలు బయటకు రావద్దని చైనా ప్రభుత్వం హెచ్చరిస్తోంది.