తెలంగాణ రాష్ట్రంలో కరోనా కలకలం సృష్టిస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిపోతుండడంతో భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో ఆరు కేసులు పాజిటివ్ అని తేలగా.. ఇవాళ(18 మార్చి 2020) ఒక్కరోజే కేసులు డబుల్ అయిపోయాయి. మరో ఏడుగురికి కరోనా సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. ఏడు మందికి కరోనా ఉన్నట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఈ నెల 16వ తేదీ నుంచి ఐసోలేషన్‌లో ఉంచిన ఏడుగురి రక్త నమూనాల రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు అధికారులు. తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య 13కు చేరుకోగా.. వైద్య ఆరోగ్యశాఖ మరింత అప్రమత్తం అయ్యింది. ఇవాళ్టి వరకు ఆరు కేసులు అంటేనే భయాందోళన చెలరేగగా.. 13కేసులు అవ్వడంతో కంగారు పడుతున్నారు.
ఇండోనేషియా నుంచి వచ్చిన 10మందిలో ఏడుగురికి కరోనా ఉన్నట్లుగా నిర్ధారించారు వైద్యులు. రోనా వైరస్ కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ వేగంగా చర్యలు చేపడుతుంది. ‘కరోనా’ పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఎప్పటికప్పుడు సీఎస్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ నివారణ చర్యలపై ఆరా తీస్తున్నామని మంత్రి ఈటెల కూడా చెప్పారు.