తెలంగాణలో మరో ముగ్గురికి కరోనా వైరస్: 16కు చేరిన బాధితుల సంఖ్య

  • Publish Date - March 19, 2020 / 05:33 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా(కోవిడ్ 19) అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

బుధవారం( 18 మార్చి 2020) ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు నమోదవగా ఇవాళ(19 మార్చి 2020) మరో మూడు కేసులు పాజిటివ్ అని తేలాయి. ఈ విషయాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

లేటెస్ట్‌గా నిర్ధారణ అయిన మూడు కేసులతో కలిపి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరుకుంది. తెలంగాణలో మొన్నటి వరకు (మార్చి 17) కేవలం ఐదు కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే ఉండేవి.

ఈరోజు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు కూడా విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారే. ముగ్గురిలో ఒకరు దుబాయ్ నుంచి ఈనెల 14న హైదరాబాద్ వచ్చారు. మిగిలిన ఇద్దరు లండన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. వారిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

కరోనా బాధితులు వచ్చిన విమానాల్లో ప్రయాణికుల వివరాలను కూడా సేకరిస్తున్నారు అధికారులు.

See Also | కరోనా భయంతో కిరాణా సరుకులు కొని స్టాక్ పెట్టేందుకు మార్కెట్లకు పరుగులు!