ఉపాసనకు ప్రతిష్టాత్మక అవార్డు: గర్వంగా ఉందన్న రామ్‌చరణ్

  • Publish Date - April 21, 2019 / 01:32 AM IST

మెగా కుటుంబం నుంచి బిజినెస్‌లోనూ.. సామాజిక కార్యక్రమాలలోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఈ ఏడాదికి గాను దాదా సాహెబ్ ఫాల్కే ఫిలాంత్రఫిస్ట్ అవార్డు అందుకుంది. ఈ విషయాన్ని రామ్‌చరణ్ తన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు.

సామాజిక కార్యక్రమాల్లో ఉపాసన చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను ఈ అవార్డు వరించింది. ఫిలాంత్రఫిస్ట్ అవార్డు అందుకు ఉపాసనను ఉద్ధేశించి ఫేస్‌బుక్‌లో రామ్ చరణ్ పోస్ట్ చేశారు. ప్రియమైన ఉప్సీ.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

అలాగే దాదా సాహెబ్ ఫాల్కే ఫిలాంత్రఫిస్ట్ అవార్డు అందుకున్న ఉపాసన తన ట్విట్టర్‌లో ‘‘ఈ అవార్డును చాలా గౌరవంగా స్వీకరిస్తున్నాను. నా చుట్టూ ఉండి, ప్రతిరోజూ నాలో స్ఫూర్తిని నింపుతూ.. ముందుకు నడిపిస్తున్న మంచి మనసున్న వారందరికీ ఈ అవార్డును అంకితం ఇస్తున్నాను. నా వెన్నంటే ఉండి, ఎంతగానో ప్రోత్సహిస్తున్న నా కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు’’ అని పోస్ట్ చేసింది.