జనవరి 22న పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవు

  • Publish Date - January 18, 2020 / 02:34 PM IST

తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల జరుగుతున్న నేపధ్యంలో పోలింగ్‌ జరిగే రోజున సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. జనవరి 22న రాష్ట్రంలోని హైదరాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, ములుగు జిల్లాలు మినహా మిగిలిన  అన్ని జిల్లాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ఎన్నికలు జరగుతున్నాయి. ఎన్నికలు జరిగే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో  పోలింగ్ జరిగే జనవరి 22న ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.