×
Ad

హైదరాబాద్ లో మంచినీటి సరఫరాకి అంతరాయం

  • Publish Date - September 21, 2019 / 02:11 PM IST

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో మంచి నీటి సరఫరాకు  అంతరాయం ఏర్పడనుంది. నగరానికి మంచినీరు అందించే కృష్ణా ఫేస్-3 పైపు లైనుకు పలుచోట్ల ఏర్పడ్డ లీకేజీలకు జ‌ల‌మండ‌లి అధికారులు  మరమ్మత్తులు చేప‌డుతున్నారు.  

ఇందుకోసం సెప్టెంబరు 23 సోమవారం ఉద‌యం 6 గంట‌ల నుంచి సెప్టెంబరు 24, మంగళవారం ఉదయం 6గంట‌ల వ‌ర‌కు 24 గంట‌లపాటు పలుప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్పడ‌నుంది. 

మరమ్మత్తుల కారణంగా నగరంలోని సాహెబ్ నగర్, ఆటోనగర్, వైశాలి నగర్, మీర్ పేట్, జల్ పల్లి, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రిపురం, బండ్లగూడ, బుద్వేల్, సులేర్ణన్ నగర్, హైదర్ గూడ, గోల్డెన్ హైట్స్, గంధంగూడ, ఆళ్లబండ, భోజగుట్ట, షేక్ పేట్,  ప్రశాసన్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగ్, బోడుప్పల్, చెంగిచర్ల, పిర్జాదిగూడ, సైనిక్ పురి, మౌలాలి, లాలాపేట్, స్నేహాపురి కాలనీ, కైలాసగిరి రిజర్వాయర్ ప్రాంతాలలో నీటి సరఫరాను నిలిపివేయనున్నారు.