కమిషనర్ వార్నింగ్ : ఆ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే జైలుకే

  • Publish Date - September 30, 2019 / 01:48 PM IST

సీపీ అంజనీ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. నిషేధిత ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియో ట్వీట్ చేశారు. రెండు రోజుల నుంచి కొంత మంది పోకిరీలు ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారని మీడియాకు తెలిపారు. ఇరాన్, అప్ఘనిస్తాన్ ఇతర దేశాలకు సంబంధించిన కొన్ని వీడియోలను కట్ చేసి..పేస్టు చేస్తూ..పార్వర్డ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వాట్సప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్‌‌లను ఆయన హెచ్చరించారు.

ఇలాంటి వీడియోలు, ఫొటోలు ఫార్వర్డ్ చేయడం..చట్టరీత్యా నేరమన్నారు. దీనిపై కేసు రిజిష్టర్ చేయడం, అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. నిషేధిత వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చని, ప్రజల మధ్య చిచ్చు రేపవచ్చని అనుకుంటున్నారని అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. వీరి ప్రయత్నాలను తాము నెరవేరనీయమని స్పష్టం చేశారు.
Read More : పోలీస్ అలర్ట్ : జూబ్లీహిల్స్ టూ మాదాపూర్ ట్రాఫిక్ జాం

ప్రజల సహకారంతో..వీటిని అరికడుతామన్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్..తదితర వాటిల్లో ఇలాంటి వీడియోలు ఫార్వర్డ్, అప్ లోడ్ చేయవద్దని సూచించారు. ఇలాంటి పిక్చర్స్‌కు కాశ్మీర్‌కు ఎలాంటి సంబంధం లేదని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు