మత్తు వదలరా : జూబ్లిహిల్స్ చెక్‌పోస్టు వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్

  • Publish Date - February 2, 2019 / 01:18 AM IST

హైదరాబాద్‌ : సిటీలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం రోజు జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో పోలీసులు 5కార్లు, 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఇక డైమండ్‌ హౌస్‌ దగ్గర నిర్వహించిన తనిఖీల్లో 4కార్లు, 5 బైకులను స్వాధీనం చేసుకున్నారు.  మొత్తంగా రాత్రి 15 మందిపై కేసు నమోదు చేశారు.