కోడెల మెడపై గాట్లు.. అసలు విషయం అక్కడే తెలుస్తుంది : మాజీ మంత్రి సోమిరెడ్డి

  • Publish Date - September 16, 2019 / 09:44 AM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి, మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్య కాదని, ఆయన ఉరేసుకొని చనిపోయారనే ప్రచారం జరుగుతుందని, వాస్తవాలు తెలియవలసి ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

కోడెల మెడపై గాట్లు ఉన్నాయని సోమిరెడ్డి వెల్లడించారు. శవపరీక్ష కోసం కోడెల మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తున్నామని అక్కడ పూర్తి వివరాలు తెలియాలని అన్నారు. 

కోడెలను ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రికి తీసుకొచ్చారని, వైద్యులు ఎంతో శ్రమించినప్పటికీ కోడెల ప్రాణాలు కాపాడలేకపోయినట్లు సోమిరెడ్డి చెప్పారు. ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే కోడెల కన్నుమూసినట్లు సోమిరెడ్డి చెప్పారు.

కోడెల ఫౌండర్‌, ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన బసవతారకం ఆస్పత్రిలోనే ఆయన మృతిచెందడం బాధాకరమని సోమిరెడ్డి విచారం వ్యక్తం చేశారు.