దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం, హత్య ఘటనలో ఉన్న నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే, కాల్చేశారో.. అక్కడే ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు పోలీసులు. షాద్‌నగర్ దగ్గర చటాన్ పల్లిలో ఉన్న ఓ బ్రిడ్జి కింద దిశను నిందితులు దహనం చేసిన చోటే వారిని హతం చేశారు.
ఆ ప్రాంతానికి దగ్గరలోనే.. తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులపై దాడి చేసి పారిపోతున్న నలుగురు నిందితుల శరీరాల్లోకి బుల్లెట్లు దిగిపోయాయి. దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. ఎన్‌కౌంటర్‌కి సంబంధించి లైవ్ మినిట్ టూ మినిట్… వాచ్ ఆన్ 10Tv