భాగ్య నగరాన్ని వేడెక్కించిన పరువు హత్య ప్రకాశం జిల్లాలోనూ వేళ్లూనుకుంది. ప్రణయ్ అమృతాల చేదు ఘటన మరువక ముందే ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెంలో మరో ఘటన చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న కోట వైష్ణవి(20) తన సహ విద్యార్థిని ప్రేమిస్తున్నానని అతడినే వివాహం చేసుకుంటానని ఇంట్లో అనుమతి కోరింది. వాళ్లు ససేమిరా అనడంతో మొండిపట్టు పట్టింది.
దీంతో వాగ్వాదం పెరిగి ఆవేశంలో ఆ తండ్రి విచక్షణ కోల్పోయాడు. కన్న కూతురినే గొంతునులిమి హత్యచేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.