బ్రేకింగ్ న్యూస్ : షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

  • Publish Date - October 21, 2019 / 01:02 AM IST

హైదరాబాద్, ఎల్బీనగర్‌లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో కలకలం రేగింది. ఐసీయూలో మంటలు చెలరేగాయి. ఈ సమయంలో చాలా మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో ఊపిరాడక సూర్యాపేటకు చెందిన ఐదు నెలల చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఐసీయులో 42మంది చిన్నారులు ఉన్నారు.

వెంటనే ఆస్పత్రి సిబ్బంది స్పందించారు. సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రి అద్దాలను పగులగొట్టి..కొంతమందిని కాపాడారు. అక్కడకు చేరుకున్న ఫైరింజన్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 

చికిత్స పొందుతున్న చిన్నారులను ఐసీయు నుంచి బయటకు తీసుకొచ్చారు. వారిని సమీపంలోని లోటస్ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై రోగులతో మాట్లాడారు. కానీ మంటలు ఎలా చెలరేగాయో తెలియరాలేదు. 
Read More : బ్యాక్ టు స్కూల్ : కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె