హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

  • Publish Date - October 12, 2019 / 04:25 AM IST

హైదరాబాద్‌లోని నాంపల్లి యం.జే మార్కెట్‌‌లో శనివారం(12 అక్టోబర్ 2019) తెల్లవారుజామున 5 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకోగా.. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి.

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు.  పీవీసీ పైపులను నిల్వ ఉంచిన బిల్డింగ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ అధికారులు, ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చినా కూడా నష్టం మాత్రం భారీగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.