హైదరాబాద్ : నగరంలో పుట్ పాత్ డ్రైవ్ కొనసాగుతోంది. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా జనవరి 05వ తేదీ చందానగర్ సర్కిల్‌లోని వివిధ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు అధికారులు. ఏడున్నర కిలోమీటర్లలో దాదాపు 500 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు.
ఉదయమే రంగంలోకి దిగిన బల్దియా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆక్రమణలను తొలగిస్తోంది. సిటీలో పాదచారులకు నడిచేందుకు సరైన వసతి కల్పించడం తమ ఉద్దేశం అంటున్నారు బల్దియా అధికారులు. అయితే కొందరు బల్దియా అధికారుల తీరుపై మండిపడుతున్నారు స్థానికులు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆక్రమణలు వదిలేసి చిన్న చిన్న వాటినే కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై జీహెచ్ఎంసికి మంచి సపోర్ట్ లభిస్తోంది. ఈ డ్రైవ్‌ను కంటిన్యూ చేస్తున్నారు బల్దియా అధికారులు. ఇప్పటివరకు దాదాపు 13 వేల అక్రమ నిర్మాణాలను గ్రేటర్ పరిధిలోని ఫుట్‌పాత్‌లపై తొలగించారు బల్దియా ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు.