GHMC కూల్చివేతలు : బాధితులపై అధికారి ఓవరాక్షన్

  • Publish Date - February 16, 2019 / 05:45 AM IST

ఆక్రమణల కూల్చివేతలో ఇన్ ఛార్జీ ఎమ్మార్వో ఓవర్ యాక్షన్ కలకలం రేపుతోంది. తన ఇళ్లు కూల్చొద్దంటూ వేడుకున్న ఓ వృద్ధుడి కాలర్ పట్టుకోవడం..గిరిజన మహిళ చేయి పట్టి లాగిపడేయడంపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి. మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ కాప్రా మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూల్చివేస్తున్న సందర్భంలో సహనంతో ఉండాల్సిన ఈ అధికారి వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

జీహెచ్ఎంసీ పరిధిలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. అందులో భాగంగా ఇన్ ఛార్జీ ఎమ్మార్వోగా ఉన్న నాగరాజు ఫిబ్రవరి 16వ తేదీ శనివారం ఆక్రమణలు కూల్చేందుకు సిబ్బందితో కాప్రా మండలంలోని జవహార్ నగర్‌కి చేరుకున్నారు. ఆక్రమణలను జేసీబీతో కూల్చివేస్తున్నారు. తన ఇంటిని కూల్చివేయవద్దని ఓ మహిళ..తన పిల్లలతో అధికారులను వేడుకుంది. అయినా అధికారులు వినిపించుకోలేదు. పక్కనే లేడీస్ కానిస్టేబుల్స్ ఉన్నా నాగరాజు గిరిజన మహిళను చేతితో నెట్టేశాడు. అంతేగాకుండా ఓ వృద్ధుడి కాలర్ పట్టకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మరి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. 

ట్రెండింగ్ వార్తలు