GHMC Isolation Centres : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచిత ఐసోలేషన్ సెంటర్లు

భాగ్యనగరంలో కోవిడ్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు బల్దియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. హోం ఐసోలేషన్‌ సౌకర్యం లేనివారి కోసం సిటీ వ్యాప్తంగా ఉచిత ఐసోలేషన్‌ సెంటర్లను ప్రారంభిస్తోంది. 

GHMC starts Free Isolation centres in Hyderabad : భాగ్యనగరంలో కోవిడ్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు బల్దియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. హోం ఐసోలేషన్‌ సౌకర్యం లేనివారి కోసం సిటీ వ్యాప్తంగా ఉచిత ఐసోలేషన్‌ సెంటర్లను ప్రారంభిస్తోంది.  ఇప్పటికే ఎల్‌బీనగర్‌లో ఓ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన బల్దియా.. మిగతా సర్కిళ్లలోనూ ప్రయత్నాలు ప్రారంభించింది.

భాగ్యనగర వాసులను కోవిడ్‌ మహమ్మారి భయపెడుతోంది. రాష్ట్రం మొత్తం మీద ప్రతిరోజూ జీహెచ్‌ఎంసీలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హాస్పిటల్స్‌కు, ఆక్సిజన్‌ బెడ్లకు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో కోవిడ్‌ రోగులకు సరిపడా బెడ్స్‌, ఐసోలేషన్‌ సెంటర్స్‌పై దృష్టిపెట్టింది జీహెచ్‌ఎంసీ. ఇందులో భాగంగా బల్దియా పరిధిలోని 30 సర్కిళ్లలో స్పెషల్‌ కోవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఎల్బీ నగర్‌ జోన్‌లో మొదటి ఐసోలేషన్‌ సెంటర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓజోన్‌ ఆస్పత్రి సహకారంతో  కొత్తపేటలోని కృష్ణవేణి నగర్ లో  ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది బల్దియా. ఇంట్లో ఐసోలేషన్‌కు అవకాశం లేనివారు ఈ సెంటర్‌లో చికిత్స పొందవచ్చని చెబుతున్నారు అధికారులు. మందులు, ఆహారంతోపాటు అన్నీ ఉచితంగా అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఓజోన్‌ ఆస్పత్రి సహాకారంతో ఏర్పాటు చేసిన ఈ ఐసోలేషన్‌ సెంటర్‌లో మొత్తం 90 బెడ్లు ఉన్నాయి. ప్రతి బెడ్‌కు ప్రత్యేక కేర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. డాక్టర్లు రోగుల దగ్గరికి రాకుండానే వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఏ పేషెంట్‌కైనా ఆక్సిజన్‌ అవసరమైతే అలాంటి వారికోసం ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను కూడా సిద్దంగా ఉంచుతున్నారు.

ఐసోలేషన్‌ సెంటర్‌లో చేరిన ప్రతి  పేషెంట్‌కు బ్రష్‌, టూత్‌పేస్ట్‌ మొదలు పౌష్టికాహారం వరకు అన్నీ అందిస్తున్నారు. ఎట్టకేలకు కొత్తపేట ప్రాంతంలో ఐసోలేషన్‌ సెంటర్‌ అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఫీజులు భరించ లేక పోవటంతో పేద, మధ్య తరగతి వారికి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు