హైదరాబాద్ నగరంలోని నార్సింగి హైదర్‌షాకోట్‌లో కాల్పుల కలకలం రేగింది. గణేష్ నిమజ్జనంలో ఆర్మీ మాజీ జవాన్ నాగ మల్లేష్ కాల్పులు జరిపాడు. ఇంటి దగ్గర ఇంటర్నెట్ సిబ్బంది మందు పార్టీ నిర్వహించుకుంది. అయితే ఇంటర్నెట్ సిబ్బందిని నాగ మల్లేష్ పలుమార్లు వారించినా పట్టించుకోలేదు. కోపంతో ఊగిపోయిన నాగ మల్లేష్ తన రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కాల్పులకు మందు పార్టీ కారణమని తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌లోని తన ఇంటిపై హైరీచ్ ఇంటర్నెట్ సిబ్బంది మందు పార్టీ చేసుకుంటున్నారు. దీని నాగ మల్లేష్ అభ్యంతరం తెలిపాడు. మందు పార్టీ వద్దని పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన నాగ మల్లేష్ ఈ కాల్పులు జరిపినట్లు సమాచారం.
కోపంతో ఊగిపోయిన నాగ మల్లేష్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అందులో ఒకటి గాల్లోకి, మరొకటి ఓ వ్యక్తిపైకి గురిపెట్టాడు. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తి చెవి పక్క నుంచి బుల్లట్ పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు.. నాగ మల్లేష్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గరున్న రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.