హైదరాబాద్‌లో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. గాలులకు చెట్లు నేలకొరిగాయి. జూ పార్క్ లో విషాదం చోటు చేసుకుంది. చెట్టు కూలి సందర్శకులపై పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. 15మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతురాలిని వరంగల్ జిల్లాకు చెందిన ఫాతిమాగా గుర్తించారు. జూపార్క్ అధికారులు ఆమె కుటుంబానికి రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
చెట్టు కూలిన సమాచారం అందుకున్న GHMC సిబ్బందికి అక్కడికి చేరుకున్నారు. అత్యవసర వాహనం మొరాయించంతో అక్కడున్న ట్రాఫిక్ సిబ్బంది చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. నగరంలో 47 ప్రాంతాల్లో చెట్లు కూలాయి. 18 ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిందని అధికారులకు సమాచారం అందింది.
ఏప్రిల్ 20వ తేదీ శనివారం సాయంత్రం నగరంలో భారీ గాలులతో వర్షం కురిసింది. దీంతో చెట్లు నేలకూలాయి. వీకెండ్ కావడంతో జూ పార్కులో రద్దీ ఉంది. భారీ చెట్టు కూలడంతో అక్కడ తీవ్ర కలకలం రేపింది. వెంటనే అలర్ట్ అయిన ట్రాఫిక్ సిబ్బంది చెట్టును తొలగించే ప్రయత్నం చేశారు.
Also Read : హైదరాబాద్‌లో దారుణం : హెయిర్ కటింగ్‌కు వెళితే చంపేశారు