Heavy rains in Hyderabad
Rains in Hyderabad: హైదరాబాద్‌లో మళ్ళీ భారీగా వర్షాలు కురిశాయి. నిన్న సాయంత్రం నుంచి కురిసిన వర్షాలకు అనేక ప్రాంతాల్లో రోడ్లపైనే నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని నాంపల్లి, అసెంబ్లీ, బషీర్‌బాగ్, బేగంబజార్, కోఠి, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, షేక్‌పేట, రాయదుర్గం ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.
అలాగే, సైదాబాద్, మాదన్నపేట, సంతోష్ నగర్, సరూర్ నగర్, చంపాపేట్ నార్సింగి, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, అత్తాపూర్, మణికొండ ప్రాంతాల్లో భారీ వర్షం పడడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీనగర్, నాగోల్, తట్టి అన్నారంలో భారీ వర్షం కురిసింది.
మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్‌లో కురిసిన వర్షానికి కూరగాయల తోపుడు బండ్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. మూసారాం బాగ్ వంతెన గత రాత్రి మునిగిపోయింది. దీంతో అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలోని నాంపల్లిలో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదైందని, హయత్‌నగర్‌లో అత్యల్పంగా 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.
Modi Landed in Tokyo: జపాన్ చేరుకున్నానంటూ ట్వీట్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ