Rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. మరో మూడు రోజులు ఇంతే..

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షపు నీళ్ళు రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, అల్వాల్‌, చిలకలగూడ, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అలాగే, గోషామహల్‌, మంగళ్‌ హాట్‌, ఆసిఫ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, మెహిదీపట్నంలో వర్షం పడుతోంది.

Rains in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో వర్షపు నీళ్ళు రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, అల్వాల్‌, చిలకలగూడ, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. అలాగే, గోషామహల్‌, మంగళ్‌ హాట్‌, ఆసిఫ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, మెహిదీపట్నంలో వర్షం పడుతోంది.

కాగా, తెలంగాణలోని ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడిందని, తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో ఆవర్తనం ఏర్పడి సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని వివరించారు. రానున్న 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు

 

ట్రెండింగ్ వార్తలు