ఉక్కపోస్తోంది : చలికాలంలో అధిక ఉష్ణోగ్రతలు

  • Publish Date - November 6, 2019 / 01:38 AM IST

చలికాలం వచ్చేసింది. ఈసారి చలి విపరీతంగా ఉంటుందని ముందే భావించి..స్వెట్టర్లు, చలికి తట్టుకొనే దుస్తులను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాతావరణంలో భిన్నమైన మార్పులు కనిపిస్తున్నాయి. చలికాలంలో ఉక్క పోస్తోంది. వణకాల్సిన సమయంలో చల్లదనం కోసం కూలర్లు, ఏసీలు వేసుకొనే పరిస్థితి నెలకొంది. అవును..ప్రస్తుతం నగరంలో ఎండలు అధికమౌతున్నాయి. పగలు, రాత్రి సాధారణం కంటే..రెండు డిగ్రీలు అధికంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి.

ఈ సమయంలో పగటిపూట 30 డిగ్రీలు మించదని..అలాంటిది 2019, నవంబర్ 05వ తేదీ మంగళవారం 32.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి వేళ సైతం..ఉష్ణోగ్రతలు చెమటలు పట్టిస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రత 20.5 డిగ్రీలుగా నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఏసీల వినియోగం అధికమౌతోంది. ఆగ్నేయ బంగళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, అరేబియా సముద్రంలో కొనసాగుతున్న మహా తుఫాన్ ప్రభావంతో గాలుల దిశ మారడంతో నగరంలో పోడి వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈశాన్య రుతుపవనాలు వస్తే ఉష్ణోగ్రతలు సాధారణస్థితికి చేరుకుంటాయని భావిస్తున్నారు. 
Read More : మహా తుఫాన్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

ట్రెండింగ్ వార్తలు