వారికి ఆస్తులు లేవు….. అంతస్తులు లేవు…..వారిద్దరిదీ ప్రేమ వివాహాం..ఫుట్ పాత్ జీవితాలు…. అయినా ప్రేమించి పెళ్ల చేసుకున్నారు… మద్యం మహమ్మారి వారి జీవితాన్ని కాటేసింది. మద్యానికి బానిసైన భర్త తాగటానికి డబ్బులు ఇవ్వలేదని భార్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన సికింద్రాబాద్ చిలకలగూడా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
తుకారాం గేట్ కు చెందిన గౌతమ్ కుమార్(24) లాలాగూడ కు చెందిన మహాలక్ష్మి(20) ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. భిక్షాటన చేస్తూ, చిత్తు కాగితాలు అమ్మగా వచ్చే డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. వారికి ఏడాగి బాబు ఉన్నాడు. ప్రస్తుతం మహాలక్ష్మి 8నెల గర్భవతి. సికింద్రాబాద్ గాంధీ అస్పత్రి ఎదురుగా ఉన్న ఫుట్ పాత్ పై జీవనం సాగిస్తున్నారు.
https://10tv.in/muslim-man-weds-off-daughters-of-his-rakhi-sister-as-per-hindu-customs/
కాగా గౌతమ్ కుమార్ మద్యానికి అలవాటు పడ్డాడు. మంగళవారం రాత్రి మద్యం తాగటానికి డబ్బులివ్వమని భార్యను అడిగాడు. అందుకామె నిరాకరిచంటంతో గొడవపడి ఆమె వద్ద నుంచి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి సమయంలో మద్యం తాగొచ్చి నిద్రపోతున్న భార్యను కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు.