హైదరాబాద్ నగరంలో 42 కిలో మీటర్ల మేర మారథాన్ రన్ జరుగుతోంది. హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భారీ సంఖ్యలో రన్నర్స్ పాల్గొన్నారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలకు అంజనీ కుమార్ చేతుల మీదుగా పీపుల్స్ ప్లాజా నుంచి పరుగు ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రన్నర్స్ వెళ్లే ప్రాంతాలు : –
ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, రాజ్ భవన్, రాజీవ్ గాంధీ విగ్రహం, సీఎం క్యాంపు ఆఫీసు, పంజాగుట్ట ఫ్లై ఓవర్, శ్రీనగర్ కాలనీ, టీ జంక్షన్, సాగర్ సొసైటీ, ఎన్టీఆర్ భవన్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మ టెంపుల్, కావూరి హిల్స్ ఎక్స్ రోడ్డు, (లెఫ్ట్ టర్న్)…మాదాపూర్ పీఎస్, ఇమేజ్ హాస్పిటల్, సైబర్ టవర్స్..(లెఫ్ట్ టర్న్), కేఎఫ్‌సీ, ట్రిడెంట్ ఈ హోటల్, లెమన్ ట్రీ, మైండ్ స్పేస్, ఐకియా, మై హోం, బయోడైవర్సిటీ క్రాస్ రోడ్డు..(రైట్ టర్న్), సైబరాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయం, గచ్చిబౌలి ఫ్లై ఓవర్ (రైట్ సైడ్)..ఇందిరానగర్, హిమగరి ఆస్పత్రి, ఐఐటి జంక్షన్, విప్రో (రైట్ టర్న్)…క్యూ సిటీ, గౌలిదొడ్డి, గొప్పన్నపల్లి క్రాస్ రోడ్డు..(రైట్ టర్న్)..హెచ్‌సీయూ వెస్ట్రన్ గేట్, యూనివర్సిటీ 2 గేట్..(రైట్ టర్న్)..గచ్చిబౌలి స్టేడియం గేట్ నెంబర్ 2 నుంచి హెచ్‌సీయూ..(రైట్ టర్న్).. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం..వరకు పరుగు జరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు రన్ జరుగనుంది.
ట్రాఫిక్ ఆంక్షలు : –
42 కిలో మీటర్ల మారథాన్ రన్ కావడంతో రన్నర్లకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు మార్పును గమనించాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఈ విషయం తెలియక ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. ఆయా కూడళ్లలో వాలంటీర్లు నిలబడి వాహనదారులకు సూచనలు, సలహాలు అందించారు.
Read More : సంగారెడ్డి జిల్లాకు మరో జాతీయ అవార్డు