హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి రేపు లండన్ వెళుతున్నారు. లండన్ లో వారు 5రోజులు ఉంటారు. జనవరి 22న తిరిగి జగన్ కుటుంబం హైదరాబాద్ చేరుకుంటుంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకుంటున్న జగన్ కుమార్తెను చూసేందుకు కుటుంబ సమేతంగా వారు లండన్ వెళుతున్నారు. గత ఏడాది కాలంగా ఏపీలో ప్రజాసంకల్పయాత్ర చేపట్టి జనవరి 9నే యాత్ర ముగించుకుని జగన్ హైదరాబాద్ వచ్చారు.